ప్యారిస్ ఒలింపిక్స్ లోకి భారత్ అతి తక్కువ మంది రెజ్లర్లను పంపిన విషయం తెలిసిందే. అయితే అందులో మెడల్ ఆశలు ఉన్న రెజ్లర్ వినేశ్ ఫోగట్. గత ఏడాది ఇండియాలో జరిగిన రెజ్లర్ల ధర్నాలో కీలక పాత్ర పోషించిన వినేశ్ ఫోగట్ మహిళల 50 కులాల విభాగంలో 2024 ఒలంపిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
క్వాటర్ ఫైనల్స్ లోకి ఎంట్రీ కోసం టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ సాధించిన రెజ్లర్ ను ఓడించిన వినేశ్ ఫోగట్.. క్వాటర్స్ లో ఉక్రేన్ రెజ్లను 7-5 తేడాతో ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి హాఫ్ లో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 2 పాయింట్స్ సాధించిన వినేశ్ ఫోగట్ సెకండ్ హాఫ్ ప్రారంభంలోనే మరో రెండు పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ప్రత్యర్థి అటాకింగ్ లోకి దిగడంతో వరుస పాయింట్స్ ఇచ్చినా.. తన లైఫ్ ను కాపాడుకుంటూ మ్యాచ్ లో విజయం సాధించి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.