Bengaluru police files an FIR over Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులో కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌ను సమయం మించిపోయినా నడపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్‌తో పాటు మరో నాలుగు పబ్‌లపైనా కేసులు నమోదు చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. కోహ్లీ పబ్‌లో మ్యూజిక్‌ను భారీ సౌండ్‌తో ప్లే చేస్తున్నారని కూడా తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ… మొన్న జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడి.. హీరోగా మారాడు. ఇక ఇటీవలే హైదరాబాద్ లో కూడా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ…ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు.