World Cup 2023 : విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు..!

-

వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్ లో 765 పరుగులు చేసిన మొదటి బ్యాటర్ గా రికార్డుల్లో నిలిచారు. ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కోహ్లీ 54 పరుగులు చేశాడు. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు టీ 20 వరల్డ్ కప్ 2014లో 319, ఐపీఎల్ లో 2016లో 973లలో కూడా ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లీ పేరిటే ఉండటం గమనార్హం.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 54 పరుగులు మాత్రమే సాధించి క్లీన్ బౌల్డ్ కావడం కాస్త నిరాశ పరిచాడు. అంతకు ముందు వన్డేల్లో 50వ సెంచరీ సాధించి ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేశాడు. అంతకు ముందు సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ ప్రారంభానికి ముందే విరాట్ కి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ ప్రత్యేకమైన బహుమతిని కూడా పంపించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news