Sreemukhi : చిన్నగౌను వేసుకున్న రాములమ్మ.. ఎంత అందంగా ఉన్నావమ్మా

-

బుల్లితెర రాములమ్మ.. అదేనండి శ్రీముఖి బుల్లితెరపై తన సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ తన హవా చూపిస్తోంది. తాజాగా శ్రీముఖి పొట్టిగౌనులో ఫొటోలు షేర్ చేసింది. మల్టీ కలర్ గౌనులో శ్రీముఖి అందాలు మామూలుగా లేవు.  ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరను ఏలుతోంది. వరుసగా షోస్ చేస్తూ చాలా బిజీబిజీగా గడుపుతోంది. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. తాజాగా శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి సరసన సూపర్ ఛాన్స్ కొట్టేసింది. భోళాశంకర్ మూవీలో ఓ కీలక పాత్రలో శ్రీముఖి కనిపించనుందని సమాచారం. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.

ఇక శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ ఫొటోలు షేర్ చేస్తూ.. రీల్స్ పోస్టు చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తూ ఉంటుంది. ఇక తరచూ వెకేషన్స్ కు వెళ్తూ హాయిగా జాలీగా గడిపేస్తూ ఉంటుంది. ఇటీవలే శ్రీముఖి హైదరాబాద్ లో ఓ ఇల్లు కూడా కొనుగోలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news