ఐపీఎల్ 2024: సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ గా డేనియల్ వెటోరి …

-

ఐపీఎల్ సీజన్ 2024 కోసం అన్ని ఫ్రాంచైజీలు టీం సభ్యులను మరియు కోచింగ్ స్టాఫ్ ను సిద్ధం చేసుకున్నాయి. అందులో భాగంగా ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తమ హెడ్ కోచ్ ను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సన్ రైజర్స్ హెడ్ కోచ్ ను కూడా మార్చేశారు. ఇంతకు ముందు వరకు వెస్ట్ ఇండీస్ లెజెండ్ బ్రియాన్ లారా కోచ్ గా ఉండగా, ఇతని సారధ్యంలో ఏమంత ప్రభావవంతంగా జట్టు సక్సెస్ కాలేదు. అందుకే విసుగు చెందిన సన్ రైజర్స్ యాజమాన్యం కోచ్ ను మార్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పురుషుల టీం కు సహాయక కోచ్ గా ఉన్న న్యూజిలాండ్ లెజెండ్ క్రికెటర్ డేనియల్ వెటోరి ని కొత్త హెడ్ కోచ్ గా నియమించుకుంది.

ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ సీజన్ లో అయినా వెటోరీ ఈ జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపింది కప్ ను అందిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version