IPL SRH vs GT : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ స‌న్ రైజ‌ర్స్.. తుది జ‌ట్లు ఇవే

-

ఐపీఎల్ 2022 లో భాగంగా ఈ రోజు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య 21వ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో కీల‌కమైన టాస్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ముంబై న‌గ‌రంలోని డీవై ప‌టీల్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో పిచ్ కాస్త పొడిగా ఉంది.

స్పీన్న‌ర్ల‌కు కాస్త అనుకూలించే అవకాశం ఉంది. అయితే గుజ‌రాత్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్ లో ఆడి… గెలిచింది. ప్ర‌స్తుతం ఓట‌మి ఎరుగ‌ని జ‌ట్టుగా గుజ‌రాత్ టైటాన్స్ ఉంది. అలాగే స‌న్ రైజ‌ర్స్ మూడు మ్యాచ్ లు ఆడి కేవ‌లం ఒక్క మ్యాచ్ లోనే విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో రెండో విజ‌యం సాధించాల‌ని స‌న్ రైజ‌ర్స్ సిద్ధం అవుతుంది. కాగ తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు :
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ( కెప్టెన్ ), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ ( వికెట్ కీప‌ర్ ), ఐడెన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు :
మాథ్యూ వేడ్ ( వికెట్ కీప‌ర్ ), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

Read more RELATED
Recommended to you

Latest news