షాకింగ్ : కొబ్బరి చెట్టెక్కి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి !

-

దేశంలో కొబ్బరికాయల కొరత ఎంత ఉంది అనేది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో భాగంగా శ్రీలంకకు చెందిన మంత్రి ఒకరు కొబ్బరి చెట్టు ఎక్కి ప్రెస్ మీట్ లో విలేఖరులని ఉద్దేశించి ప్రసంగించారు. కొబ్బరికాయల రాష్ట్ర మంత్రి అయిన అరుండికా ఫెర్నాండో స్థానిక పరిశ్రమలకు అధిక డిమాండ్ ఉందని, అలానే దేశీయ వినియోగం కూడా ఎక్కువగా ఉన్న కారణంగా దేశం మొత్తం మీద 700 మిలియన్ కొబ్బరికాయల కొరత ఉందని పేర్కొన్నారు.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో కొబ్బరి పరిశ్రమ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందని చెప్పచ్చు. ఇది అక్కడి జనానికి ప్రధానమైన ఆహార పదార్థంగా ఉండటంతో పాటు మూడవ అత్యధిక విదేశీ మారక ద్రవ్యంగా ఉంది. అలానే ప్రభుత్వ పన్నుల ఆదాయానికి ఈ కొబ్బరి పరిశ్రమ ముఖ్యమైన వనరు అని చెప్పచ్చు. కొబ్బరికాయల రాష్ట్ర మంత్రి అయిన ఫెర్నాండో, కొబ్బరికాయల సాగు కోసం దేశం అందుబాటులో ఉన్న భూమిని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలానే దేశానికి విదేశీ మారక ద్రవ్యం కలిగించే ఈ పరిశ్రమను మరింత పెంచాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కొబ్బరికాయ ధరల సమస్యకు పరిష్కారంగా దేశంలో కొబ్బరి కాయల ధరలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news