సమంత ఐటెం సాంగ్ పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా నటించిన సినిమా పుష్ప. ఎర్రచందనం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. అయితే ఈ సినిమాలో… అల్లు అర్జున్, రష్మిక నటనలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో… సమంత ఐటమ్ సాంగ్ కూడా ఈ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చింది.

ఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఇలా ఉండగా సమంత చేసిన ఈ ఐటెం సాంగ్ పై శ్రీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అందరి నోట్లోనూ సమంత నటించిన ఈ ఐటమ్ సాంగ్ యే నాను తోందని… ఎవరు చూసినా ఇదే పాట పాడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. దీనిపై త్వరలోనే ఓ వీడియో పెట్టి.. విశ్లేషిస్తారు అని పేర్కొంది శ్రీ రెడ్డి. తన ఫ్యాన్స్ సమంత ఐటం సాంగ్ పై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేసింది. తాను సంఘసంస్కర్త కాబట్టి ఈ పాటపై కచ్చితంగా మాట్లాడతానని పేర్కొంది.