ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన : సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఓమిక్రాన్ కొత్త వేరియంట్.. 90 దేశాలకు పైగా పాకింది. ఇటు మన ఇండియాలోనూ 300కు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో నైట్ కర్ఫ్యూ కూడా విధిం చేయాల్సిందేనని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఇలాంటి తరుణంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై తీవ్ర సందిగ్దత నెలకొంది.

పశ్చిమ బెంగాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ర్యాలీలు నిర్వహించడం వల్ల విపరీతంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా ఇలాగే ర్యాలీలు, బహిరంగ సభ నిర్వహిస్తే ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరో నెల లేదా రెండు నెలల్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

ఇలాంటి తరుణంలో బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓమిక్రాన్ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తారు…అలాగే ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన రాబోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ సుబ్రమణ్య స్వామి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్లు సెప్టెంబర్ మాసంలో కూడా నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.