హీరో నానికి మంత్రి అనిల్ స్ట్రాంగ్ కౌంటర్.. నాకు ఆ హీరో ఎవరో తెలియదు

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నిన్న సినిమా టికెట్ల ధరల పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా థియేటర్ల ఓనర్ల కు వచ్చే ఆదాయం కంటే కిరాణాకొట్టు నడిపేవాడి ఆదాయం ఎక్కువగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిన్న హీరో నాని కౌంటర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే హీరో నాని చేసిన కామెంట్లకు అదే రేంజ్ లో ఏపీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నానికి.. తన స్టైల్లో పంచ్ ఇచ్చారు.

సినీ హీరోలు పారితోషకం తగించుకుంటే ..టికెట్ల ధరలు మరింత తగ్గుతాయన్నారు. అసలు నాకు హీరో నాని ఎవరో తెలియదని.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమేనని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారని.. ఆయన మోజు లో పడినేను కూడా చాలా తగలేసానని ఫైర్ అయ్యారు. అమ్మా..నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బు ను కొందరు యువకులు క్రేజ్ కోసం సినిమాలకు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.