ఉషా ఛాయాదేవిలతో సూర్యదేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

-

సూర్యుడు.. కన్పించే ప్రతక్ష్య దేవుడు. హిందూమతంలోనే కాకుండా పలు ఇతర మతాలలో కూడా సూర్యారాధన మనకు కన్పిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అనేక సూర్యదేవాలయాలు ఉన్నాయి. వాటిలో కేవలం సూర్యుడు మాత్రమే ఉండగా ఒక దేవాలయంలో మాత్రం సూర్యుడితో సహా ఆయన భార్యలుగా పిలవబడుతున్న ఉషా, ఛాయదేవీలు కూడా ఉన్నారు. ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి విశేషాలు తెలుసుకుందాం…

 

వైదిక కాలంలో మిగతా దేవతలతో పోలిస్తే సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది. అలాంటి అతి కొద్ది సూర్య దేవాలయాలలో రెండు ప్రాచీన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. వీటిలో  అందరికీ తెలిసింది అరసవెల్లి. రెండోదే మనం తెలుసుకునబోతున్న గొల్లమామిడాల దేవాలయం.

ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియన మరో పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం. 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని పూర్వం పిలిచేవారు.

గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

గొల్లల మామిడాడలో సూర్య భగవానునికి ఆలయం ఓ విశేషం అయితే, ఈ స్వామి ఉష, ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news