దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పై మోదీ స్పందన ఏంటంటే.. ?

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతున్న నేపధ్యంలో ప్రస్తుత పరిస్దితుల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధిస్తుంది అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా మన ప్రధాని మోదీ సీఎంలతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని, ఇప్పటికే దేశంలో అన్‌లాక్‌ 1.0 సాగుతోందని, అన్‌లాక్‌ 2.0 ఎలా అమలుచేయాలనే దానిపై చర్చించాలని పేర్కొన్నారు.

ఇకపోతే ఈ మధ్య ఏ రాష్ట్రంలో చూడు కరోనా విపరీతంగా తన ప్రతాపాన్ని చూపిస్తూ ప్రజలకు నిదురలేకుండా చేస్తుంది.. లాక్‌డౌన్ సడలించడం వల్ల సమాజంలో సోషల్ డిస్టెన్స్ పాటించే వారే కరువైయ్యారు.. జనం గుంపులు గుంపులుగా తిరగడమే కాదు, కొన్ని చోట్ల కొందరైతే మాస్కులు కూడా ధరించడం లేదు.. ఇదే సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు చోటు చేసుకుని కరోనా వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.. ఇలాంటి పరిస్దితులు నెలకొంటున్న క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులపై స్పష్టత ఇవ్వాలని ‌కోరగా ప్రధాని ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.

 

ఇకపోతే కరోనా కట్టడికి టెస్టింగ్‌ల సామర్థ్యం పెంచడంతో పాటు ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలని మోదీ కోరారు.. ఇక ఇప్పటికే విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్ధిక పరిస్దితులతో పాటుగా సగటు సామాన్యునికి కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి.. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ అనే ఆలోచన చేయడం అంత సులువు కాదు.. అలాగని ఈ వైరస్ బారి నుండి ప్రభుత్వాలు కాపాడుతాయని ఆశించడం కూడా కరెక్ట్ కాదు.. కాబట్టి ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు అన్న విషయాన్ని అర్ధం చేసుకుని ముందుకు వెళ్లగలరని విన్నపం..

Read more RELATED
Recommended to you

Latest news