శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం మనకి తెలిసిందే. దీంతో మరోసారి దివాలా తీసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యం లో రుణ చెల్లింపుల్ని ఐదేళ్లదాకా వాయిదా వేయాలని రుణదాతలకి అధ్యక్షుడు రనిల్ విక్రమ సింగే విజ్ఞప్తి చేశారు 2028 దాకా విదేశీ రుణ చెల్లింపులు మీద తాత్కాలిక నిషేధాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
బుధవారం ఆయన శ్రీలంక పార్లమెంట్లో మాట్లాడారు బిలియన్ల డాలర్ల రుణాలు బాండ్ల పునర్నిర్మాణానికి ద్వైపాక్షిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అన్నారు శ్రీలంక చరిత్ర లో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం తర్వాత దేశం రుణ నిర్మాణానికి దగ్గరగా ఉందన్నారు డిసెంబర్ 2027 చివరిదాకా అప్పులన్నీ తీర్చకుండా తాత్కాలిక ఉపశమనం పొందాలని భావిస్తున్నట్లు చెప్పారు.