BSP ఎఫెక్ట్..కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ?

-

బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్ కారణంగా గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు ఎఫెక్ట్ కారణంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.. అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Indrakaran Reddy, former MLA Vithal Reddy into Congress

అంతేకాదు….మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.. ఇద్దరూ కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, ఈనెల 12 లేదా 13వ తేదీలలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కోనేరు కోనప్ప. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీల మధ్య పొత్తు కుదిరింది. ఎంపీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, బీఆర్ఎస్ తో బీఎస్పీ ప్రవీణ్ కుమారు పొత్తు పెట్టు కోవడంతో బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప గుడ్ బై చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news