లక్ష్యఛేదనలో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక

-

ఆసియాకప్‌ సూపర్‌-4లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా శ్రీ‌లంకతో పోరులో విఫలమైంది. ముఖ్యంగా లంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివరకు 213 పరుగులకు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో దునిత్‌ రికార్డు సృష్టించాడు. అయితే.. సొంతగడ్డపై 214 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదనుకున్న శ్రీలంకకు టీమిండియా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో స్వాగతం పలికారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెలరేగడంతో లంక 8 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది.

బుమ్రా 2 వికెట్లు తీయగా, సిరాజ్ 1 వికెట్ తీశాడు. ఆసియా కప్ సూపర్-4 దశలో జరుగుతున్న ఈ పోరులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బుమ్రా, సిరాజ్ హడలెత్తించారు. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంకను బుమ్రా అవుట్ చేయగా, మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నేను సిరాజ్ వెనక్కిపంపాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. ప్రస్తుతం శ్రీలంక 14 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు చేసింది. సదీర సమరవిక్రమ 10, చరిత్ అసలంక 13 పరుగులతో ఆడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version