హీరోల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటున్నా : శ్రీలీల

-

యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల.. టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన అందాల సునామీ. రెండేళ్ల క్రితం `పెళ్లి సందడి` చిత్రంలో నటించింది. కె రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ పాటలు బాగా హిట్‌ అయ్యాయి. ఇందులో హీరోయిన్‌ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. అందంతోనూ ఆకర్షించింది. ఈ రోజున శ్రీలీల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆమె సినిమాలకి సంబంధించిన పోస్టర్స్ తో సోషల్ మీడియాలోను గట్టిగానే సందడి కనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ ..”సినిమాలన్నా .. నటనన్నా నాకు చాలా ఇష్టం. అందువల్లనే ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను చేయడమనేది నాకు కష్టంగా అనిపించడం లేదు” అని అంది.

Sreeleela Biography, Wiki, Age, Nationality, Net Worth, Boyfriend

“మొదటి నుంచి కూడా మంచి బ్యానర్లు .. మంచి కథలు .. పాత్రలు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను పనిచేస్తూ వెళుతున్న ప్రతి హీరో నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాను. బాలీవుడ్ ఛాన్సుల గురించి ఆలోచించలేదు .. అయినా అందుకు చాలా సమయం ఉంది. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే, మంచి సినిమాలు చేశాననే సంతృప్తి కలగాలి .. అలాంటి సినిమాలు చేసుకుంటూ వెళతాను” అంటూ చెప్పుకొచ్చింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news