అమాంతరం రేటు పెంచిన.. “పెళ్లి సంద‌డి” భామ శ్రీ‌లీల !

-

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. ఈ సినిమా ఏకంగా రూ.10 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు, తొలి షోకే ఫ్లాప్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో వసూళ్లూ అందుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీలీల స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అదిరిపోవడం, ఆమె నటన హుషారుగా సాగడంతో.. కుర్రకారు ఈ సినిమాకు ఓటేశారు. దీంతో ఊహించని.. వసూళ్లు వచ్చాయి. ఈ హిట్టు.. శ్రీలీలకు బాగా హెల్ప్‌ అయింది.

ఇప్పుడు ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలున్నాయి. రవితేజ, నవీన్‌ పొలిశెట్టి సినిమాలో ఈ భామే హీరోయిన్‌. తొలి సినిమాకు రూ.5 లక్షల పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ.. రెండు సినిమాకు రూ.40 లక్షలకు పాకింది. ఇటీవల శ్రీలీల ఓ కొత్త సినిమాకు రూ.75 లక్షలు తీసుకుని సంతకం పెట్టిందని సమాచారం. ఇక ఇప్పుడు శ్రీలీల కాల్‌ షీట్లు కావాలంటే.. కోటీ ఇవ్వాల్సిందే. కొత్తగా ఎవరైనా కథ చెప్పడానికి వస్తే.. కోటీ ఇస్తారా అని అడిగేస్తుందట. అటు.. నిర్మాతలు కూడా కోటీ ఇచ్చేందుకు రెడీ అంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news