గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..!

గ్యాస్ సిలెండర్ ప్రతీ ఒక్కరి ఇంట్లోకి అవసరం. గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగాయంటే సామాన్యులకి మరెంత ఇబ్బంది అవుతుంది. అయితే ధరలు తగ్గితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది. తాజాగా గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఒకటో తేదీ శుభవార్త తీసుకు వచ్చింది. గ్యాస్ ధరలు ఇప్పుడు దిగొచ్చాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం జరిగింది. ఈ ప్రయోజనం అందరికీ ఉండదు.

కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల వీరికి మాత్రమే ఉపశమనం కలగనుంది. ఇక ధరల విషయంలోకి వస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 14.2 కేజీల సిలిండర్ ధరను అలానే ఉంచాయి. ఏ మార్పు లేదు. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నేటి నుండే అమలు లోకి రానుంది. సిలిండర్ ధర రూ.91.5 తగ్గింది. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండ్ ధర రూ.1907కు దిగివచ్చింది.

గత నెలలో కూడా తగ్గింది. అప్పుడు అయితే సిలిండర్ ధరను 102.5 మేర తగ్గించేశాయి. కానీ ఇప్పుడు అప్పుడు కూడా 14.2 కేజీల సిలిండర్ ధరలో మాత్రం మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరల విషయంలో మార్పు చేస్తాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి వాటి ప్రభావం ఈ ధరల్లో పడుతుంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.89 దిగివచ్చింది. ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 91.5 తగ్గింది. చెన్నైలో రూ.50.5 మాత్రమే తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.960 వద్ద వుంది.