వివాదంలో శ్రీముఖి “క్రేజీ అంకుల్స్” మూవీ

టాలీవుడ్ పరిశ్రమలో సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం కామన్ అయిపోయింది.   తాజాగా మరో సినిమా వివాదం లో పడింది. స్టార్ యాంకర్ శ్రీ ముఖి నటించిన “క్రేజీ అంకుల్స్” సినిమా  వివాదంలో పడింది. “క్రేజీ అంకుల్స్” సినిమా ట్రైలర్ లోనే మాహిళల్ని కించ పర్చారని మహిళ సంఘాలు ఆరోపణలు చేస్తున్నారు. సినిమా మహిళల మనోభావాలను గాయ పరుస్తున్నాయని మహిళ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు.

“క్రేజీ అంకుల్స్” సినిమా ను అడ్డుకోవాలంటూ ఈ మేరకు తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన కి పిలుపు నిచ్చింది తెలంగాణ మహిళ హక్కుల వేదిక. ఈ సినిమాను ఎట్టి పరిస్తుతుల్లోనూ అడ్డుకుంటామని “క్రేజీ అంకుల్స్” చిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చారు. కాగా యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ పేరుతో సినిమా తెరకెక్కింది. రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కీల పాత్రదారులుగా కనిపిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. ఇక ఈ “క్రేజీ అంకుల్స్” మూవీ ఈ నెల 19 వ తేదీన అన్నీ థియేటర్ల లో విడుదల కానుంది.