దేత్తడి హారిక నియామకం మీద స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. కొత్త కదా.. తెలియక చేసిండు !

-

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హరిక నియామకం సై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొత్తగా చైర్మన్ అయిన శ్రీనివాస్ గుప్తా తెలియక చేశాడని అన్నారు. ఏం జరిగింది , ఎలా అపాయింట్ చేశారో నాకు తెలియదన్న ఆయన కూర్చొని మాట్లాడుకుని , ఇబ్బంది లేకుండా సరిచేసుకుంటామని అన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో ఎలాంటి విభేదాలు లేవన్న ఆయన కమిటీ వేసి , అందరూ ఓకే అనుకుంటే హరికను కొనసాగిస్తామని అన్నారు.

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకుంటామని అన్నారు. నిజానికి మహిళా దినోత్సవం రోజున దేత్తడి హారికను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. తర్వాతి రోజు ఈ నియామకం అంశం మీద సీఎంవో అధికారులు సీరియస్ అయ్యారు. ఆమె వివరాలు వెబ్ సైట్ నుండి తొలగించారని ప్రచారం జరగగా కార్పొరేషన్ చైర్మన్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నిన్న శ్రీనివాస్ గౌడ్ అసలు ఆమె ఎవరో తనకు తెలియదని పేర్కొనడంతో నొచ్చుకున్న హారిక తను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించింది. 

Read more RELATED
Recommended to you

Latest news