కీరవాణికి పద్మశ్రీ.. రాజమౌళి రియాక్షన్ ఇదే

-

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీకి చెందిన సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మశ్రీకి ఎంపికవ్వడం పట్ల కీరవాణి స్పందించారు. పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల అభిమానంతోనే పద్మశ్రీ వచ్చిందని చెప్పారు.

మరోవైపు కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. అభిమానులంతా ఆశిస్తున్నట్లే తాను కూడా ఎదురుచూశానని చెప్పారు. కీరవాణికి పద్మశ్రీ అవార్డు కోసం చాలా కాలం ఎదురుచూశానని అన్నారు. గట్టిగా అనుకుంటే ఏదో ఒకరూపంలో ప్రతిఫలం అందుతుందని వెల్లడించారు.

సంగీత దర్శకుడు కీరవాణిది ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కీరవాణి స్వస్థలం. 1990లో ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావు నిర్మించిన ‘మనసు మమత’ సినిమాకు ఆయన మొదటిసారి సంగీత దర్శకుడిగా పనిచేశారు. దాదాపు 250 సినిమాలకి స్వరాలు సమకూర్చారు. అన్నమయ్య సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిదిసార్లు, నేపథ్య గాయకుడిగా మూడుసార్లు నంది పురస్కారాల్ని అందుకున్నారు.

ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మార్మోగిపోతుంది. ఆ చిత్రంలో నాటు నాటు పాటకిగానూ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాన్ని క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్‌ని అందుకున్నారు. ఆస్కార్‌ అవార్డుల కోసం నామినేషన్‌ని కూడా దక్కించుకుని చరిత్రని సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news