నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మరో సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి..దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్-10 సెలక్షన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేసన్ ద్వారా మొత్తం 1920 పోస్టులను కమిషన్ భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 13 రాత్రి 11 గంటల 30 నిముషాల వరకు కొనసాగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు..
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తీ వివరాలను ఎస్సెస్సీ పత్రికా ప్రకటన విడుదల చేసింది..ఈ పోస్టులకు సంభందించిన పూర్తీ వివరాలను సంస్థ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..