భవిష్యత్తు పై ఫుల్ క్లారిటీతో ఉన్న సితార..అలా అవుతాం అంటూ ప్రేక్షకులకు షాక్..!

-

సితార.. 8 యేళ్ళకే తన పేరును బాగా పాపులర్ చేసుకుంది ఈ చిన్నారి.. సాధారణంగా ఆ వయసు కలిగిన పిల్లలు ఆటలు ఆడడం, చదువుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ చిన్నారి తన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేయడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఈ చిన్న పాప పనిచేస్తోంది. ప్రస్తుతం పెరిగి పెద్దయిన సితార సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇకపోతే ఇటీవల మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో పెన్ని పాటలో సితార స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ఆ పాట తో బాగా పాపులర్ అందుకున్న సితార ప్రేక్షకుల్లో మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇకపోతే మే 12వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సితార ఎన్నో విషయాలను ప్రేక్షకులతో అలాగే మీడియా తో పంచుకోవడం జరిగింది. ప్రమోషన్స్ లో భాగంగా మీరు భవిష్యత్తులో ఏమి అవుదాం అని అనుకుంటున్నారు.. ఇంజనీర్ .. డాక్టరా అంటూ పడగానే ఆమె నవ్వుతూ ఒక యాక్టర్ అవ్వాలని కోరిక ఉంది అంటూ తెలిపింది. భవిష్యత్తులో గొప్ప స్టార్ నటి కావాలి అని , అందు కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని సితార చాలా కాన్ఫిడెంట్గా చెప్పడంతో మీడియా మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది.

అంతేకాదు ఇంత చిన్న పాప భవిష్యత్తు లో ఏమవుతుందో కూడా ఇప్పటి నుంచి నిర్ణయించుకుని ఆ మార్గం వైపు అడుగులు వేయడం చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ పలువురు నెటిజెన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది సితార అంటే మహేష్ బాబు కూతురు కాబట్టి ఆయన తెలివితేటలు పాపకు వచ్చాయి అందుకే ముందు జాగ్రత్తగా తన భవిష్యత్తు కి ప్రణాళికలు వేసుకుంటోంది. ఆల్ ద బెస్ట్ బంగారు తల్లి అంటూ చాలామంది సితార కు ఇప్పటి నుంచి మద్దతు పలుకుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news