రోజులో కనిపించి, కనబడని దేవాలయం. ఆ దేవాలయంలో భగవంతుడిని దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది ? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. గుజరాత్ రాష్ట్రంలోని కవి కాంబోయ్ పట్టణంలో ఉన్న 150 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ పురాతన శివాలయం అరేబియా సముద్రం మరియు కాంబే బే మధ్య ఉంది. ఇది చాలా సరళమైన ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అధిక ఆటుపోట్ల సమయంలో ఈ ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది.
ఈ ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. దైర్యం చేసి ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు ఆ పరమేశ్వరుని ఆశిస్సులు తప్పక లభిస్తాయని భక్తుల నమ్మకం. మన ఇండియాలో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం ఇది. అయితే ఈ ఆలయం గురించి ఒక వింత విషయమేమిటంటే సముద్రపు అలలు తక్కువగా ఉన్న సమయంలో మాత్రమే లోపలికి ప్రవేశించాలి. మిగిలిన సమయాల్లో సముద్రపు నీటితో ఆలయం పూర్తిగా నీటి మునిగి ఉంటుంది. తర్వాత మళ్లీ కొన్ని గంటల తర్వాత కనబడుతుంది.
తెల్లవారుజామున తక్కువ ఆటుపోట్ల సమయంలో మీరు ఆలయాన్ని చూడవచ్చు, ప్రవేశించవచ్చు. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది ఇప్పటికీ తెలియదు. అలాగే ఈ ఆలయం సమీపంలోని మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఈ ప్రదేశం యొక్క సుందరమైన సౌందర్యాన్ని చూడడానికి చాలా మంది సందర్శకులు వస్తుంటారు.