మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉన్నా ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే లుక్ లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటుంది. వరుసగా బడా సినిమాలు రిలీజ్ అవుతుండగా ఆచార్య చిత్రాన్ని మాత్రం ఇంకా రిలీజ్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఉగాది రోజున ఆచార్య నుండి ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏప్రిల్ 10న శ్రీరామనవమిమి సందర్భంగా ఆచార్య చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయడమో లేక ట్రైలర్ రిలీజ్ కు సంబంధించిన డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా అందాలభామలు కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు.