బిగ్ బీ ని డైరెక్ట్ చేయబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, బిగ్ బీ ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవల అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ కి కథ వినిపించాడట. అమితాబ్ కి కథ నచ్చడంతో ఓకే అన్నాడని సమాచారం. అజయ్ దేవగణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో మెరుస్తాడట. అటు నిర్మాతగా, ఇటు దర్శకుడిగా, నటుడిగా మూడు బాధ్యతలు ఈ సినిమా ద్వారా తీసుకోనున్నాడట. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ పైలట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

అజయ్ దేవగణ్ గతంలో శివాయ్ సినిమాకి దర్శకత్వం చేసిన సంగతి తెలిసిందే.
డిసెంబరు నెలలో మొదటి షెడ్యూలు స్టార్ట్ అవుతుందని, హైదరాబాద్ వేదికగా షూటింగ్ మొదలవనుందని తెలుస్తుంది. అటు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ప్రత్యేక కనిపిస్తున్న సంగతి తెలిసిందే.