మంచులో విహారయాత్రలకు వెళ్ళడం అనేది చాలా మందికి సరదా… సమయం దొరికితే చాలు చాలా మంది మంచు ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇందుకోసం ముందు నుంచి ప్లాన్ చేసుకుని రెడీ అవుతూ ఉంటారు. సంతోషంగా గడపడానికి ఆ ప్రదేశాలను ఎంచుకుంటారు. ఇక సిని జనం, క్రికెట్ ఆటగాళ్ళు అయితే మంచులోకే పదే పదే వెళ్తూ ఉంటారు. ఇక ఇది మంచి పడే సీజన్ కావడంతో చాలా మంది విదేశీ పర్యటనలో ఉంటున్నారు.
కొంత మంది తమ ప్రియురాలు, ప్రియుడు, భార్యలతో వెళ్తున్నారు. తాజాగా బాలివుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా కూడా విదేశీ పర్యటనకు వెళ్ళింది. తాజాగా ఈ బ్యూటీ యూరప్ ఖండంలోని ఆస్ట్రియాకి వెళ్లింది. అక్కడి పోస్టాల్మ్ పర్వతాల్లో కుప్పలు తెప్పలుగా కురుస్తున్న మంచులో ఎంజాయ్ చేస్తుంది. ప్రకృతిని ఆశ్వాదిస్తూ దొరికిన కాళీ సమయాన్ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ భామ మంచు తినేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాన్ని తినాలనిపించి, అక్కడి వారిని తినవచ్చా అని అడిగి తినేసి చాలా టేస్టీగా ఉందని చెప్పింది. దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేసి సందడి చేస్తుంది ఈ భామ. గత కొంత కాలంగా వరుస విజయాలతో ఆమె దూసుకుపోతుంది. ఈ సీజన్ లో ఆస్ట్రియాలో మంచు భారీగా కురవడంతో పర్యాటకులు ఎక్కువగా ఉంటారు.