టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి సెలబ్రిటీలు చేసే పనులను మరికొంతమంది ఫాలో అవుతూ ఉంటారటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఒక ఊరిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నిజజీవితంలో కూడా చాలామంది హీరోలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తో సహా ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు కూడా ఈ గొప్ప పనిలో భాగమైన విషయం తెలిసిందే. వీరే కాదు ఇంకా చాలామంది నటీనటులు తమ సొంత ఊర్లకు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు.
ఈ లిస్టు లోకి సీనియర్ హీరో ఆదిత్య ఓం కూడా చేరాడు. లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి తలుపు తడితే, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలియదు , మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా అన్నయ్య బంగారం వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు పలు హిందీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆదిత్య ఓం. దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న ఈయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన ఔధార్యాన్ని చాటుతున్నాడు. తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా చెరుపల్లిలోని ఐదు గ్రామాలను దత్తత తీసుకొని దాదాపు 500 మంది అవస్తలు తీర్చిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి , కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించడానికి శ్రీకారం చుట్టాడు.
అక్కడ గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఈయన కోవిడ్ సమయంలో అంబులెన్స్ సదుపాయం లేకపోవడం, ఆ ప్రాంతంలో పాముకాటు కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోవడం చూసి చలించి అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్ మరియు దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగాడు. స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆదిత్య చేసిన పనికి ప్రతి ఒక్కరు హార్షం వ్యక్తం చేస్తున్నారు.