అగ్ర హీరోలతో నిర్మాతలకు తల నొప్పి అయిపోయిందా…?

-

ఈ మధ్య కాలంలో తెలుగులో సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగింది. కమర్షియల్ హీరోలు గా మారిపోయారు అగ్ర హీరోలు అందరూ కూడా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ముఖ్యంగా అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా వంద కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్యా క్రమంగా పెరుగుతుంది. ఇటీవలి కాలంలో అది 150 అయింది కూడా.

దీనితో అగ్ర హీరోలు అందరూ తమకు కమర్షియల్ కథలు ఉండాలని అలా అయితేనే సినిమాలు చేస్తామని చెప్పడం చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారు. దర్శకులకు కూడా అలాంటి షరతులు పెట్టడం తో నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్కెట్ భారీగా వచ్చే అవకాశం ఉంటే మాత్రం నిర్మాతల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. సినిమాలో ఎక్కువగా షేర్ అడుగుతున్నారు. తాము నిర్మాతలం అవుతామని చెప్తున్నారు.

సినిమా ముందు మార్కెట్ తో పాటుగా వసూళ్ళలో షేర్ ఇవ్వాలని, అలాగే సినిమా విడుదల తర్వాత ఉండే మార్కెట్ కూడా కొంత కావాలని డిమాండ్ చేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వైఖరి మారకపోతే మాత్రం ఇబ్బంది పడతారని నిర్మాతలు హీరోలను హెచ్చరిస్తున్నారు. దర్శకులు ఇప్పుడు చాలా మంది ముందుకి రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఎవరూ కూడా ఇప్పుడు బయటకు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news