హీరోయిన్లకు ఇంత పొగరా…?

-

కొంత మంది హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో తమ పొగరు చూపిస్తున్నారు. వరుస అవకాశాలు రావడమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని కొందరు హీరోయిన్లు అనుసరిస్తున్న వ్యవహారశైలి పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ అవసరం ఉందని భావించిన హీరోయిన్లు ఇప్పుడు ఆందోళన కరంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది అనేది వాస్తవం.

ఒక హీరోయిన్ ఈ ఏడాది రెండు హిట్స్ కొత్తగా మరో హీరోయిన్ ఒక హిట్ కొట్టింది. ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా హిట్ కొట్టింది అగ్ర హీరోలతోనే. దీనితో ఇప్పుడు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఒక హీరోయిన్ ని ఇటీవల నానీ పక్కన నటించాలని ఒక దర్శకుడు కోరగా… ఆమె చేయను అని మొహం మీద చెప్పేసింది. దానికి కారణం నానీ కి స్టార్ డం తక్కువగా ఉండటమే అని ఆ హీరోయిన్ చెప్పడం చూసి షాక్ అయ్యారట.

ఇక మరో హీరోయిన్ అయితే తనకు రెండు కోట్లు కావాల్సిందే అని డిమాండ్ చేయడం ఇప్పుడు షాక్ అయింది. చిన్న చిన్న హీరోలతో తాను చేయను అని ఒక హీరోయిన్ అంటుంటే చిన్న నిర్మాతలు… చిన్న హీరోల పక్కన తాను సినిమాలు చేసేది లేదని మరో హీరోయిన్ చెప్పడం తో టాలీవుడ్ ఇప్పుడు షాక్ అవుతుంది. వీరిపై నిర్మాతలు మండిపడుతున్నారు. దిక్కు లేక వాళ్ళను తీసుకున్నాం గాని వాళ్ళు ఏదో మహానటులు కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news