ఆకాశంలో నక్షత్రాలు ఏ ఆకారంలో ఉన్నాయో తెలుసా ?

-

ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలు కొన్ని నక్షత్రాల సమూహాలు. ఆ నక్షత్రాల ఆకృతుల గురించి మన పూర్వీకులు విశేషంగా పరిశోధించారు. ప్రస్తుత సాంకేతికత లేనిరోజుల్లోనే గ్రహణాలు ఎప్పుడు పడుతాయి. ఆ గ్రహణ విశేషాలు కచ్చితమైన గణనలతో చెప్పడం మనందరికీ నేటికీ తెలిసిన విషయమే. అలాగే నక్షత్రాల గురించి కూడా మన పూర్వీకులు అనేక విశేషాలు తెలిపారు. వాటి గురించి పెద్దలు, పండితులు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం…

విశ్వంలో అనంతమైన నక్షత్రాలు. కానీ మన కంటికి కనిపించి మన గెలాక్సీలో అంటే పాలపుంతలో ఉండే వాటి గురించి తెలుసుకుందాం.. 12 రాశులలో 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రం నాలుగు పాదాలు. వాటి ఆకృతుల గురించి తెలుసుకుందాం…

అశ్విని….తురగముఖాశ్వినీ త్రీణి (గుర్రం ముఖం ఆకృతి లో ఉన్న మూడునక్షత్రాల గుంపు)

భరణి…భరణీ యోని త్రీణి (యోని ఆకృతి లో 3 నక్షత్రాలు)

కృత్తిక..కృత్తికా క్షురాషట్కం (మంగలి కత్తి ఆకృతి లో 6 నక్షత్రాలు)

రోహిణి..రోహిణీ శకటం పంచ (బండి ఆకృతి లో 5 నక్షత్రాలు)

మృగశిర…మృగశిరా శీర్షం త్రయం (శిరస్సు ఆకారం లో 3 నక్షత్రాలు)

ఆరుద్ర..ఆరుద్రా ప్రవాళమేకం (పగడం ఆకృతి లోమెరుస్తూ ఒకే నక్షత్రం)

పునర్వసు..పునర్వసూ కులాల చక్రం పంచ (కుమ్మరి సారె రూపం లో 5 నక్షత్రాలు)

పుష్యమి..సరళా పుశ్యమి త్రీణీ (సరళాకృతిలో వరుసగా 3 నక్షత్రాలు)

ఆశ్లేష….ఆశ్లేషా సర్పా ఋతూ (సర్పాకృతిలో 6 నక్షత్రాలు)

మఖ…మఖాందోళికా పంచ (పల్లకి ఆకృతి లో 5 నక్షత్రాలు)

పుబ్బ-పుబ్బ ,ఉత్తర నేత్ర ద్వయో (కంటి ఆకృతి లో 2 నక్షత్రాలు)

ఉత్తర…. పుబ్బ ,ఉత్తర నేత్ర ద్వయో (కంటి ఆకృతి లో 2 నక్షత్రాలు)

హస్త..హస్తా పాణినాం పంచ (చేతి వేళ్ళ ఆకృతిలో 5 నక్షత్రాలు)

చిత్త..చిత్తా మౌక్తిక మేకం (ముత్యం ఆకృతి లో ఒకే ఒక నక్షత్రం)

స్వాతి..స్వాతి మాణిక్య మేకం (మాణిక్యం ఆకృతి లో ఒకే ఒక నక్షత్రం)

విశాఖ..విశాఖా కులాల చక్రం పంచ (కుమ్మరి సారె రూపం లో 5 నక్షత్రాలు)

అనూరాధ.. అనూరాధా జ్యేష్టాంగుళ చత్రాకారం త్రయం (గొడుగు ఆకృతి లో 3 నక్షత్రాలు)

జ్యేష్టా.. అనూరాధా జ్యేష్టాంగుళ చత్రాకారం త్రయం (గొడుగు ఆకృతి లో 3 నక్షత్రాలు)

మూల..మూలా కుప్యత్కేసరి పంచ (కోపించిన కేసరి ఆకృతి లో 5 నక్షత్రాలు)

పూర్వాషాడ…పూర్వాషాడ,ఉత్తరాషాడ ద్వే ద్వే భేకం(కప్ప ఆకృతి లో 2)

ఉత్తరాషాడ… పూర్వాషాడ,ఉత్తరాషాడ ద్వే ద్వే భేకం(కప్ప ఆకృతి లో 2)

శ్రవణం…శ్రవణం మఛ్ఛాకార త్రయం (చేప ఆకారం లో 3)

ధనిష్ట..ధనిష్టా శీర్షత్రయం (శీర్షాకృతిలో 3 నక్షత్రాలు)

శతభిషం…శతభిక్చతం తారా (100 తారల గుంపు)

పూర్వాభాద్ర..పూర్వాభాద్ర,ఉత్తరాబాద్ర ద్వే ద్వే ఖట్వం(మంచమ్ ఆకృతిలో 2 నక్షత్రాలు)

ఉత్తరాభాద్ర… పూర్వాభాద్ర,ఉత్తరాబాద్ర ద్వే ద్వే ఖట్వం(మంచమ్ ఆకృతిలో 2 నక్షత్రాలు

రేవతీ..రేవతీ మత్స్యాకార త్రయం (చేప ఆకారంలో 3 నక్షత్రాలు).

ఇలా 27 నక్షత్రాల షేప్స్‌ పైన చెప్పినట్లు ఉన్నాయి. ఇలా విశ్వం గురించి మన పురాణాలలో, వేదాలలో అనేక విషయాలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version