తెలంగాణ టు ఏపీ.. కొత్త ఆంక్షలు.!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులు ఇకపై ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాల అనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. కాబట్టి 7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు.

అది కూడా పాస్ తప్పనిసరిగా ఉండాలని.. పాస్ లేకుండా ప్రయాణించే వారిని అనుమతించడం లేదని అందువల్ల ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధిత అధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ – మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

కాగా, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లేవారిని అక్కడి అధికారులు 14 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. వీరి ఆరోగ్యాన్ని నిత్యమూ గ్రామ, వార్డు వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమీక్షిస్తుంటారు. ఒకవేల ఎవరైనా ఈ నిబందనలు ఉల్లంగిస్తే వారిపై పోలీసు కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version