సినీ ఇండస్ట్రీలో రహస్యంగా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. వెండితెరను ఏలిన సావిత్రి ,శ్రీదేవి వంటి హీరోయిన్లు కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ వారి వ్యక్తిగత జీవితంలో రహస్య వివాహం చేసుకుని అభిమానులను ఒక్కసారిగా షాక్ ఇవ్వడం జరిగింది. ఇక అలా రహస్యంగా వివాహం చేసుకుని అభిమానులకు షాకిచ్చిన ఆ స్టార్ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మహానటి సావిత్రి: సినీ ఇండస్ట్రీలో సావిత్రి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు , తమిళ భాషా చిత్రాలలో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న సావిత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి మరి జెమినీ గణేశన్ ను ప్రేమించింది . అతడికి పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారని.. రహస్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత తెలియడంతో చేసేదేమిలేక జీవితం కొనసాగించింది. ఇకపోతే ఈ విషయం సావిత్రి అభిమానులు తెలుసుకొని మాత్రం పూర్తిగా షాక్ అయ్యారు.
శ్రీదేవిశ్రీదేవి మిథున్ చక్రవర్తి ని రహస్యంగా వివాహం చేసుకుంది. అయితే మిథున్ చక్రవర్తికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానుల గుండె ముక్కలైందని చెప్పవచ్చు. ఇక. కొన్ని కారణాల వల్ల మిథున్ చక్రవర్తితో విడిపోయిన శ్రీదేవి బోని కపూర్ ను వివాహం చేసుకుంది.
రమ్యకృష్ణకమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
శ్రియదశాబ్ద కాలం పాటు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె రష్యా కి చెందిన ఫోటోగ్రాఫర్ ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంది. అంతేకాదు కూతురు పుట్టిన విషయాన్ని కూడా దాచి పెట్టింది.