రైతులకి శుభవార్త…ఈ వారమే ఖాతాలలోకి 2000 రూపాయలు.!

-

ఈ వారమే ప్రభుత్వం రైతుల ఖాతాలలో ₹2000 రూపాయలు వేయబోతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తి చేసినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రభుత్వం “రైతు భాగస్వామ్యం- ప్రాధాన్యత హమారీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని కింద పెద్ద సంఖ్యలో రైతులకు KCC( కిసాన్ క్రెడిట్ కార్డు) కార్డులు అందిస్తుంది. ఈ పథకం కూడా పీఎం కిసాన్ పథకానికి అను సంధించారు. ఇప్పుడు ఈ ప్రచారం ముగియడంతో రైతుల ఖాతాల్లోకి 11వ విడత డబ్బులు విడుదల చేయనుంది. మంత్రి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సంవత్సరానికి రూ.6000 మూడు విడతలుగా అందజేస్తారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 11 కోట్ల మంది రైతుల డేటా వెరిఫై అయ్యిందని ఒక అధికారి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు ఈ- కేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ పథకం కింద దాదాపు రూ. 22000 కోట్ల రూపాయలుఇ ఒకేసారి విడుదల అవుతాయి. కాబట్టి మీ ఖాతా స్టేటస్ ని చెక్ చేస్తూ ఉండండి. ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 155261 మరియు 011-24300606 కి కాల్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news