త్వరపడండి.. ఉచిత పోలీసు శిక్షణ ప్రారంభం..!

ఇటీవలే తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని పేద విద్యార్థులు అందరికీ తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా పోలీస్ శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. ఎంతో మంది పోలీసు అవ్వాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించక… ఇబ్బందులు పడే వారికి చేయూత అందించేందుకు ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జూనియర్ కాలేజీల్లో ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇంటర్ బోర్డు. ఇటీవలే మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆర్టీవో సాయిరాం ప్రారంభించారు. విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని… ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకున్నారు.