హైదరాబాద్ మహానగరంలో స్టార్టప్-20 ఇండియా సదస్సు ఇవాళ ప్రారంభమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సదస్సుకు జీ-20సభ్యదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అంకుర సంస్థల అభివృద్ధిచ; ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సమన్వయంపై సదస్సులో చర్చిస్తున్నారు.
దేశంలో పరిశ్రమలు, ఐటి, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా ప్రారంభం అవుతున్నట్లు నీతీ ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ అన్నారు. నీతీ అయోగ్ కేంద్రం, రాష్ట్రాలతోపాటు మారుమూల గ్రామాలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు. తెలంగాణ… దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా 69 ఇంక్యూబేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. టైయర్-2, టైయర్-3 నగరాల్లో అంకుర సంస్థలు పెరుగుతున్నట్లు చెప్పారు
‘దేశంలో 19 వేల అంకుర సంస్థలున్నాయి. పరిశ్రమలు, ఐటీ, విద్య, వైద్య రంగాల్లో అంకుర సంస్థలు ఎక్కువగా వస్తున్నాయి. నీతి ఆయోగ్ కూడా థింక్ ట్యాంక్ లాంటింది.
కేంద్రం.. రాష్ట్రాలకే కాకుండా గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తోంది. నీతి అయోగ్ పరిధిలో ఎన్నో ఇన్నోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని పరమేశ్వరన్ తెలిపారు.