వివాహ వేడుకకి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మీకు తెలుసా..?

-

ప్రతీ ఒక్కరి లైఫ్ లో కూడా వివాహం అనేది ఎంతో ముఖ్యమైంది. వివాహాన్ని వేడుకలా జరుపుతారు. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అయితే మీకు ఓ విషయం వివాహ బీమాను కూడా ఇస్తుంటారు. ఈరోజు వివాహ బీమా కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూసేద్దాం. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్రధానంగా దాదాపు రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పెళ్లిళ్లకు అందుబాటులో ఉంటుంది.

ఈ ఇన్సూరెన్స్ అనుకోని అనిశ్చితి పరిస్థితుల్లో పెళ్లి ఆగిపోయిన సందర్భాల్లోనే వస్తుంది. అదే ఒకవేళ కనుక వరుడు లేదా వధువు వాళ్ళ ఆలోచనలను మార్చుకొని వివాహం ని రద్దు చేసుకుంటే మాత్రం ఈ ఇన్సూరెన్స్​ కింద కవరేజీ లభించదు. మాములుగా ఎవరూ కూడా మ్యారేజ్ క్యాన్సల్ అవుతుందని కోరుకోరు అందుకే వివాహ బీమా తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు అని ICICI లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్, రీఇన్స్యూరెన్స్ చీఫ్ సంజయ్ దత్తా అన్నారు.

అయితే ఇన్సూరెన్స్‌లను కొనుగోలు చేయమని ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్లు తీసుకోమని అంటుంటారని పెళ్లిలో ఈ కవర్ ఆ నష్టాలను తిరిగి చెల్లిస్తుందని చెప్పారు. భారతదేశంలో దీనికి అంతగా డిమాండ్ లేకపోవడానికి కారణం ఎవరూ కూడా మ్యారేజ్ క్యాన్సల్ అవుతుందని కోరుకోరు. అందుకే ఎక్కువగా ఆసక్తి చూపరు. కానీ భారీ-బడ్జెట్ పెళ్ళిళ్ళకి మాత్రం బీమా కవరేజీ తీసుకోవడమే ఉత్తమం. అలానే పెళ్లి కనుక వివాహానికి అవసరమైన అనుమతులు లేకుండా చేస్తూ ఆగిపోయినా.. కోర్టు తీర్పులు, పూజారులు లేదా అతిథులు రాకపోవడం వలన పెళ్లి ఆగిపోతున్నా సరే ఇది వర్తించదు.

 

Read more RELATED
Recommended to you

Latest news