స్టేట్ బ్యాంక్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిందా..? ఇలా సులభంగా అన్ బ్లాక్ చేసుకోవచ్చు..!

-

ఏటీఎం డెబిట్ కార్డు చాలా ముఖ్యం. దీన్ని మనం సరిగా వాడితే ఏ ఇబ్బంది కూడా ఉండదు. కానీ కొన్ని పొరపాట్లు చేస్తే కార్డు బ్లాక్ అవ్వచ్చు. స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు ఏటీఎం కార్డు బ్లాక్ అయితే తిరిగి అన్‌బ్లాక్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఒక్కోసారి పిన్ నెంబర్ మరచిపోయి కొందరు ఏటీఎంలో పిన్ వరుసగా మూడు సార్లు తప్పుగా కొడతారు. దానితో ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతుంది. 24 గంటల పాటు ఏటీఎం కార్డు పని చేయదు. కానీ ఇది టెంపరరీనే. ఏటీఎం కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే మాత్రం కార్డును బ్యాంకులు బ్లాక్ చేస్తాయి. నేరుగా కొత్త కార్డును పంపిస్తాయి. ఇతర కారణాలతోనూ ఒక్కోసారి ఇవి బ్లాక్ కావచ్చు. అలాంటప్పుడు ఇలా మళ్ళీ అన్ బ్లాక్ చేసేయవచ్చు.

దీని కోసం ముందు యెనో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. MPIN ద్వారా యోనో యాప్ లోకి వెళ్లి మీరు లాగిన్ కావాలి.
ఇప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఏటీఎం డెబిట్ కార్డు ఆప్షన్ ని ఎంపిక చేసేయండి.
మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసేసి… సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత యాక్టివ్ కార్డు మీద నొక్కండి.
అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న అకౌంట్ సెలెక్ట్ చేసి, కార్డు నంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ పై క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే చాలు.
ఇవేమి కాకుండా 1800112211, 18004253800కు ఫోన్ చేసి కూడా అన్ బ్లాక్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news