G-20 సదస్సు.. పుతిన్, జిన్​పింగ్ గైర్హాజరుపై జైశంకర్ రియాక్షన్

-

మరో నాలుగు రోజుల్లో దేశ రాజధాని దిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకుకు.. రష్యా, చైనా దేశాల అధ్యక్షులు రాకపోవడంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేద, సంపన్న దేశాల కూటములుగా విడిపోతున్న సమయంలో వారధిగా వ్యవహరిస్తున్న భారత్‌పై దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది..? అనే ప్రశ్నకు జైశంకర్‌ సమాధానం ఇచ్చారు.

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న జీ 20 సదస్సుకు కొందరు దేశాధినేతలు హాజరు కావడం లేదని.. కానీ ఇప్పుడు అది ముఖ్యం కాదని జైశంకర్ అన్నారు. వారి తరఫున వచ్చే ప్రతినిధులు ప్రపంచ రాజకీయాలకు తమవంతు సహకారం అందిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఏ దేశం నుంచి ఎవరు హాజరవుతారనే విషయం కంటే.. వచ్చిన దేశ ప్రతినిధులు ఆయా అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై దృష్టి కేంద్రీకరించడం ఎంతో మేలని జై శంకర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news