రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోంది : రేవంత్‌ రెడ్డి

-

ఎందరో విద్యార్ధులు , యువత త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ములుగులో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని సోనియా భావించారని ఆయన వెల్లడించారు.

ఇది ఇలా ఉంటె, ప్రస్తుత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాపురావుకు కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని చర్చించారు. ఇంతలో రాథోడ్ బాపురావు పై చీటింగ్ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version