రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు : ప్రియాంక

-

బస్సు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ లో రామప్ప ఆలయానికి అన్నాచెల్లెలు బయలుదేరారు. ముందుగా రామప్ప ఆలయానికి చేరుకుని 6 గ్యారంటీలతో శివుడి ముందు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ములుగు, భూపాలపల్లి బస్సుయాత్రలో పాల్గొనున్న రాహుల్, ప్రియాంక, రాత్రి భూపాలపల్లిలోనే బస చేయనున్నారు.

ప్రియాంక మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ కావాలనే స్వప్నాన్ని మీరు నెరవేర్చుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం దొరుకుతుందని అనుకున్నారు. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు ఆగుతాయని అనుకున్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని ఆశించారు. కానీ, భారాస అధికారంలోకి వచ్చి మీ ఆశలు నెరవేరకుండా చేసింది. రాజకీయ లబ్ధికోసం ఆలోచించకుండా తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చారు. ఇక్కడి ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి” అని ప్రియాంక గాంధీ అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version