తెలంగాణ ఐటీ, పరిశ్రమల వార్షిక నివేదికలు విడుదల

-

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదికలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ప్రతి సంవత్సరం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర జనాభాతో పోలిస్తే రెట్టింపు దేశ జీడీపీకి తెలంగాణ అందిస్తోందని పేర్కొన్నారు. దేశ తలసరి ఆదాయం రూ. లక్షా 27 వేల 768 ఉంటే రాష్ట్ర ఆదాయం రూ. 2 లక్షల 27 వేల 145 గా ఉందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 2019-20లో 1.28 లక్షల కోట్లు ఉంటే 2020-21లో రూ. 1.45 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు.

జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రం నుంచి 7 శాతం ఎక్కువ ఎగుమతులు జరిగాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ దార్శనికత వల్ల దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని తెలిపారు. ఐటీ రంగంపై 20 లక్షల మందికి పైగా ఆధారపడి ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ విధివిధానాలు సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. క్లిష్ట పరిస్థుత్లో కూడా ఐటీ పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని కేటీఆర్ తెలిపారు. కష్టపడి పని చేసే అధికారులు ఉండలం వల్లే అభివృద్ధి సాధ్యమంతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news