అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు బుధవారం భారత్​కు రాక..!

-

యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న రఫేల్ యుద్ధవిమానాలు బుధవారం భారత్​కు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన విమానాలు అబుదాబిలోని అల్​- దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్​బేస్ వద్ద ప్రస్తుతం నిలిచి ఉన్నాయి. తొలిబ్యాచ్​లో బయల్దేరిన 5 విమానాల్లో రెండు శిక్షణ, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి.

Flight
Flight[tps_header][/tps_header]

యూఏఈ నుంచి హరియాణాలోని అంబాలాకు బుధవారం చేరుకోనున్నాయి యుద్ధవిమానాలు. మొత్తం ఏడు వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణంలో రఫేల్‌ జెట్‌లు గాలిలోనే ఇంధనాన్ని నింపుకోనుండగా.. అందుకోసం ఫ్రాన్స్‌ వైమానిక దళం ప్రత్యేకంగా ఒక ఇంధన ట్యాంకర్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది.

చైనాతో సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో వాయుసేనకు రఫేల్​ అందుబాటులోకి రావడం దేశానికి అత్యంత సానుకూల విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైమానిక దళ అమ్ములపొదిలోకి ఈ అత్యాధునిక విమానం చేరనున్న నేపథ్యంలో రఫేల్​ను కలిగి ఉన్న ఫ్రాన్స్​, ఖతార్​, ఈజిప్ట్​ దేశాల సరసన నిలవనుంది భారత్.

Read more RELATED
Recommended to you

Latest news