బిగ్ బ్రేకింగ్: అంబులెన్స్ ల అనుమతిపై తెలంగాణా ప్రభుత్వ ఉత్తర్వులకు స్టే

సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణ లోకి వస్తున్న అంబులెన్స్లను అడ్డుకోవడం పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. తాము చెప్పినా సరే అంబులెన్సులను ఎందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడింది. ముందస్తు అనుమతి ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయగా రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపి తమ ఉత్తర్వులను పట్టించుకోకపోవడంపై మండిపడింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. రాజ్యాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం మారుస్తుందా అంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకోవడంతో రోగుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీ రామ్ వాదనలు వినిపించారు. ఆయన వ్యక్తం చేసిన అభ్యంతరాలను తెలంగాణ హైకోర్టు సమర్థించింది.