కేసీఆర్ పై సుప్రీం కోర్ట్ కి వెళ్తాం: ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో తెలంగాణా పోలీసులు అనుసరిస్తున్న వైఖరి కాస్త ఇబ్బందికరంగా మారింది. తెలంగాణా పోలీసులు జాలి దయా లేకుండా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్ట్ కి అయినా సరే వెళ్లి న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక ఈ అంశంపై తెలంగాణా హైకోర్ట్ లో వాదనలను ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం వినిపిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వంపై ఆయన పలు అభ్యంతరాలు వ్యక్తం చేయగా దీనిపై హైకోర్ట్ సానుకూలత వ్యక్తం చేసింది. ఇక హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడింది. దేశంలో ఎక్కడా కూడా ఈ విధమైన ఆదేశాలు లేవు అంటూ తెలంగాణా హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.