యూపీలో అక్రమ అక్రమకట్టడాల కూల్చివేతపై స్టే విధించలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

ఉత్తరప్రదేశ్ సర్కారు అక్రమకట్టడాల కూల్చివేత లో అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ పై సుప్రీం కోర్టు ధర్మాసనంముందు గురువారం వాదనలు జరిగాయి. కట్టడాల కూల్చివేతలకు ముందు నిర్ణీత విధానాన్ని అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతా చట్టబద్ధంగానే జరగాలని పేర్కొంది.

మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్ లో అల్లర్లు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి ఇంటికి అక్కడి మున్సిపల్ యంత్రాంగం నోటీసులు జారీ చేసి పాక్షికంగా కూల్చి వేసింది. దీంతో జమైత్ ఉలేమా ఇ హింద్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. సహజ న్యాయ సూత్రాలను యూపీ ప్రభుత్వం గౌరవించడం లేదని పేర్కొంది. ముందుగా నోటీసు ఇచ్చి, ప్రాపర్టీ యజమానుల వాదన వినాల్సి ఉంటుంది అని గుర్తు చేసింది. ఓ మత వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సర్కారు వ్యవహరిస్తున్నట్లు పిటిషనర్ ఆరోపణలు చేశారు. నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం 15 నుంచి 45 రోజుల గడువు ఇవ్వాలని పేర్కొన్నారు.

ఏ మత వర్గాన్ని కూడా తాము లక్ష్యంగా చేసుకోవడం లేదని యూపీ సర్కారు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రయాగ్ రాజ్, కాన్పూర్లో కూల్చివేతకు ముందు నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చినట్లు చెప్పింది. యూపీ సర్కారు తరపున అడ్వకేట్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.” కూల్చివేత పై స్టే విధించలేం. చట్ట ప్రకారం నడుచుకోవాలి అని ఆదేశించగలం. కూల్చివేతలనేవి చట్టం పరిధిలోనే జరగాలి. ప్రతీకారాత్మకంగా ఉండకూడదు.” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version