మునుగోడుకు ఈటల రాజేందర్ డబ్బులు !

-

మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గరపడింది. ఈ నేపథ్యంలో… అన్ని పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి అభ్యర్థి కోసం భారీ ఎత్తున తరలివస్తున్న డబ్బు ఆదివారం రాత్రి పోలీసు తనిఖీలలో పట్టుబడింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చెందిన జమున హచరీస్ నుంచి సుమారు రూ. 90 లక్షలను తరలిస్తున్నట్టు వెల్లడయ్యింది.

పోలీసుల కథనం ప్రకారం షామీర్ పేట సమీపంలోని పూడూరులో ఉంటున్న కడారి శ్రీనివాస్ మూడేళ్లుగా హుజురాబాద్ ఎమ్మెల్యేగా, ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జమున హాచరీస్ వ్యవహారాలను జనార్దన్ చూస్తుంటాడు. త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్తే కొంత డబ్బు ఇస్తారని దానిని తీసుకొని మునుగోడు వెళ్లాల్సి ఉంటుందని డ్రైవర్ శ్రీనివాస్ కు జనార్దన్ సూచించాడు. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 82 లోని త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కన్స్ట్రక్షన్స్ కు చెందిన నాగరాజు అనే వ్యక్తి నుంచి రూ. 89,92,000నగదు బ్యాగ్ తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news