చౌకైన, విస్తృతంగా లభించే స్టెరాయిడ్ మందులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కరోనా రోగులకు కరోనా నుంచి బయటపడటానికి సహాయపడతాయని నిన్న ప్రచురించిన అంతర్జాతీయ క్లినికల్ ట్రయల్స్ స్పష్టం చేసాయి. అనేక పరిక్షలు, ఆధారాల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త చికిత్సా మార్గదర్శకాన్ని జారీ చేసింది. తీవ్రమైన అనారోగ్య౦తో బాధపడే రోగులకు చికిత్స చేయడానికి స్టెరాయిడ్లను సిఫార్సు చేసింది.
కాని తేలికపాటి వ్యాధి ఉన్నవారికి కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన బృందం నేతృత్వంలోని ఏడు అధ్యయనాల నుండి సేకరించిన ఫలితాల విశ్లేషణలో, స్టెరాయిడ్లు మొదటి నెలలో మరణ ప్రమాదాన్ని మూడింట ఒక వంతు తగ్గించినట్లు కనుగొన్నారు. ఈ తీవ్రమైన అనారోగ్య రోగులలో ప్లేసిబో చికిత్స లేదా అదనపు ఆక్సిజన్ అవసరమని పేర్కొన్నారు. ఈ ఫలితాలను ఈ రోజు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్, జామాలో ప్రచురించారు.