ఐపీఎల్ : మిగతా మ్యాచ్ లు కూడా గెలవలేము..?

-

ఐపీఎల్ ప్రారంభంలో మొదట ఎన్నో మెరుపులు మెరిపించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత మాత్రం పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటోంది. మొదట రెండు మూడు మ్యాచ్ లలో మెరిపించిన మెరుపులు ఆ తర్వాత మాత్రం కనిపించడం లేదు. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలం అవుతున్న స్టీవ్ స్మిత్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు… ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోజురోజుకు దిగజారి పోతుంది.

కాగా తమ వరుస ఓటమిల పై స్పందించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్… తమ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తాను కూడా సరిగా ఆడటం లేదని… జట్టులో బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ రాబోయే మ్యాచ్ లలో కూడా ఇలాగే పేలవ ప్రదర్శన చేస్తే మిగతా మ్యాచ్ లు కూడా గెలవలేము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులోని ఆటగాళ్లు ప్రదర్శన తీరును మార్చుకొని మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ తెలిపాడు స్టీవ్ స్మిత్.

Read more RELATED
Recommended to you

Latest news