ఏపీ ప్రభుత్వం, సీఐడీకి ఈ మధ్య వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎందులో అనుకున్నారు. అదేనండి ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో. ఈ కేసులో సుప్రీంకోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది సీఐడీకి. రఘురామ కేసులో భాగంగా రెండు తెలుగు న్యూస్ ఛానెళ్లపై నమోదైన రాజద్రోహ కేసులపై ఏపీ ప్రభుత్వానికి, సిఐడికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చింది.
జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో వాదనలు విని, ఆరు వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్లను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీఐడికి నోటీసులు ఇచ్చింది. ఆ రెండు తెలుగు ఛానళ్లపై చర్యలు తీసుకోకుండా స్టే ఇచ్చింది కోర్టు.
ఆ రెండు న్యూస్ ఛానళ్లు రఘురామకు సపోర్టు చేస్తూ వార్తలు ప్రచరించి, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నించాయంటూ వాటిపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు ఛానళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార పిటిషన్ ను వేశాయి. వీటిని పరిశీలించిన కోర్టు.. ఛానళ్లలో కరోనా నివేదికలు ప్రసారం చేసినందున వాటిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడంపై స్టే ఇచ్చింది.